పాఠశాల భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

పాఠశాల భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

KMM: మణుగూరు మండలం గట్టుమల్లారం గ్రామంలో రూ.15 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాన్ని గురువారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, విద్యార్థులకు ఉన్నత వసతులు కల్పించేందుకు కొత్త పాఠశాల భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు.