తెనాలిలో డ్రైవర్ నిర్లక్ష్యం.. భారీగా ట్రాఫిక్ జామ్
GNTR: తెనాలిలోని మారీసుపేట పరిధిలోని పాత బస్టాండ్ వద్ద సోమవారం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. గణేష్ నిమజ్జనం కోసం ఉపయోగించిన డీజే సౌండ్ సిస్టంలను తీసుకెళుతున్న వాహనం బ్రిడ్జి మొదట్లో నిలిచిపోయింది. ఫుట్ పాత్, డివైడర్‌కు మధ్యలో వాహనం నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. అతి కష్టం మీద వాహనాన్ని తొలగించాల్సి వచ్చింది.