దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం.. మేము సైతం

BDK: మణుగూరు మండలం సమితి సింగారం గ్రామంలో వేల్పుల మిన్నమ్మ అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మేము సైతం మిత్రమండలి మిన్నమ్మ దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా మేము సైతం మిత్రమండలి పేదవారికి వెనుదండగా ఉంటూనే వస్తున్నామని పేర్కొన్నారు.