పాల్వంచలో విషాదం.. నవజాత శిశువు మృతి

పాల్వంచలో విషాదం.. నవజాత శిశువు మృతి

BDK: పాల్వంచలోని విజయ నర్సింగ్ హోమ్ ఆసుపత్రిలో వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగా గర్భిణీ కుంజా భవాని తన కడుపులోని మగ బిడ్డను కోల్పోయింది. ఈ నెల 26న పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరిన ఆమెకు, డాక్టర్ విజయలక్ష్మి ఆలస్యంగా రావడంతో కడుపులోనే బిడ్డ మరణించింది. ఆసుపత్రి యాజమాన్యం ఫీజు కడితేనే పంపిస్తామని చెప్పడంతో బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.