ప్రజా సమస్యల పరిష్కారమే బీజేపీ లక్ష్యం
SKLM: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందనిజిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణు గోపాలం అన్నారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు జనతా వారధి అనే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ మేరకు జిల్లా జడ్పీ కార్యాలయం ఆవరణలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.