గుంతల మయంగా రోడ్డు
SRCL: చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో రోడ్డు గుంతల మయంగా మారింది. గ్రామంలోని వేములవాడ కోరుట్ల ప్రధాన రహదారిలో పలుచోట్ల రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రాత్రి వేళలో గుంతలు ఏర్పడకపోవడంతో ద్విచక్ర వాహనదారులు కిందపడి గాయాల పాలవుతున్నారు. అధికారులు స్పందించి మరమ్మత్తు పనులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.