రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్
VSP: జిల్లా కలెక్టరేట్‌లో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొననున్నారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను పూర్తి వివరాలతో సమర్పించాలని సూచించారు.