రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

ASR: పాడేరు మండలం చింతలవీధి సమీపంలో ఐటీడీఏ పెట్రోల్ బంక్ వద్ద సోమవారం రాత్రి యాక్సిడెంట్ జరిగింది. హుకుంపేట మండలం దాలిగుమ్మడికి చెందిన థామస్ ప్రవీణ్ హుకుంపేట నుంచి పాడేరుకు బైక్‌పై వస్తూ జేసీబీని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన అతడిని పాడేరు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనకాపల్లి ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.