ట్రాక్టర్ బోల్తా.. ఒకరి మృతి

NZB: బాల్కొండ మండలం బోడేపల్లి శివారులో శనివారం శ్రీరామసాగర్ ప్రాజెక్టు కాల్వలో ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందాడు. పనుల్లో భాగంగా రాజు ట్రాక్టర్ నడుపుతుండగా ఒక్కసారిగా ట్రాక్టర్ బోల్తా పడి రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.