ఎన్నికల టైమ్‌లో టిడ్కో ఇళ్ల పంపిణీ ఓ నాటకం: బోడే ప్రసాద్

కృష్ణా: ఎన్నికల టైమ్‌లో టీడ్కో ఇళ్లు పంపిణీ చేస్తామంటూ మంత్రి జోగి రమేష్ కొత్త నాటకానికి తెరదీస్తున్నాడని తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మండిపడ్డారు. ఆదివారం ఉయ్యూరులోని టిడ్కో ఇళ్ల దగ్గర ఆయన నిరసన తెలిపారు. టీడీపీ హయాంలో 70 శాతం పూర్తయిన టిట్కో ఇళ్లను ఈ ఐదు సంవత్సరాల కాలంలో పూర్తి చేయలేని అసమర్ధ ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు.