నూతన సర్పంచ్‌ను సన్మానించిన ఎమ్మెల్సీ

నూతన సర్పంచ్‌ను సన్మానించిన ఎమ్మెల్సీ

ASF: సిర్పూర్ (టీ) M చిలపల్లి గ్రామ నూతన సర్పంచ్‌గా ఎన్నికైన మానేపల్లి శ్రీను, మొగిలి సత్తయ్యలను ఎమ్మెల్సీ దండే విఠల్ ఇవాళ తన నివాసంలో శాలువాలతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పారదర్శక పాలన అందించాలని, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అర్హులకు చేరవేయాలని సూచించారు.