రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదు: మంత్రి

రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదు: మంత్రి

ADB: జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పంట నష్టం జరిగిన నేపథ్యంలో రైతులు ఆధైర్య పడాల్సిన అవసరం లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. అంకోలి గ్రామంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి మంగళవారం సాయంత్రం పర్యటించారు. రైతు జక్కుల గంగన్నతో మాట్లాడి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, నాయకులు, అధికారులు తదితరులున్నారు.