వర్షాలకు పత్తి పంట నాశనం
VKB: తుఫాను ప్రభావంతో పూడూరు మండలంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పత్తి పంట పూర్తిగా దెబ్బతింది. చేతికి వచ్చిన పత్తి కాయలు వర్షానికి తడిసి చెట్ల నుంచి కిందపడి, నల్లగా మారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే పంట నష్టాన్ని అంచనా వేసి, రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.