'పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించాలి'
RR: ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించేలా చూడాలని కొందుర్గు గ్రామ యువ నాయకుడు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను కోరారు. షాద్ నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహాదేవ్ పూర్ గ్రామానికి చెందిన నరసింహ ఎమ్మెల్యేను ఇవాళ కలుసుకొని సమస్యను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రహరీ గోడల నిర్మాణాలను కచ్చితంగా చేపడతామని హామీ ఇచ్చారు.