మాక్ అసెంబ్లీకి బద్వేల్ ఎమ్మెల్యేగా వర్షిత
KDP: బద్వేల్ నియోజకవర్గం బీ. కోడూరు మండలంలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్న కే. యోగ వర్షితకు ఈనెల 26న జరిగే మాక్ అసెంబ్లీకి బద్వేల్ నియోజకవర్గం నుంచి ఎంపికైంది. పాఠశాల, మండలం, నియోజకవర్గ స్థాయి పోటీల్లో ఆమె ఉత్తమ ప్రతిభ కనబరిచింది. సోమవారం ఆమె తల్లిదండ్రులు, గ్రామస్థులు, ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు.