పంచాయతీ ఎన్నికలు.. ప్రైవేటు స్కూళ్ల టీచర్స్ అయోమయం
RR: కేశంపేటలో తొలి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. 29 గ్రామాల్లో సర్పంచ్, వార్డుల సభ్యులను ఎన్నుకోనున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన స్కూళ్లకు విద్యాశాఖ అధికారులు నేడు సెలవు ప్రకటించారు. ప్రైవేట్ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులకు సెలవు లేకపోవడంతో, ఓటు వేయాలా వద్దా? అనే అయోమయంలో ఉన్నారు.