రాజస్థాన్‌ హైకోర్టుకు బాంబు బెదిరింపులు

రాజస్థాన్‌ హైకోర్టుకు బాంబు బెదిరింపులు

దేశంలో వరుస బాంబు బెదిరింపు ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా రాజస్థాన్ హైకోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. వెంటనే రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ బృందం హైకోర్టుతో పాటు పరిసర ప్రాంతాలను తనిఖీ చేసింది. అయితే కోర్టు ఆవరణలో పేలుడు పదార్థాలు లభ్యం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.