పేలుడు కుట్రదారులను వదిలిపెట్టం: మోదీ
ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధాని మోదీ మరోసారి స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. పేలుడు కుట్రదారులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. నిందితులను చట్టం ముందు నిలబెడతామని తేల్చి చెప్పారు. కుట్ర కోణంపై ఏజెన్సీల దర్యాప్తు మొదలైందని అన్నారు. పేలుడు ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నట్లు వెల్లడించారు.