పెద్దాసుపత్రిలో ఆధునిక వసతులు

పెద్దాసుపత్రిలో ఆధునిక వసతులు

విశాఖ జిల్లా ఆసుపత్రిలో పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో అనేక వైద్య పరీక్షలను బయట చేయించుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఈ ఇబ్బందులను తొలగించేందుకు రూ.6 కోట్ల వ్యయంతో అత్యాధునిక వైద్య పరికరాలను ఏర్పాటు చేసింది. సీఎస్‌ఆర్‌ నిధులతో ప్రభుత్వం సమకూర్చిన ఆధునిక వసతులతో ప్రజలకు మెరుగైన వైద్యం అందుతోంది.