ఆరుగురికి అవయ దానం.. సీపీ సెల్యూట్
NLG: నల్గొండ జిల్లా 25 ఏళ్ల యువకుడు హరీష్ రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందాడు. ఈక్రమంలో ఆయన తల్లి, భార్య స్ఫూర్తిదాయక నిర్ణయం తీసుకుని హరీష్ అవయవాలను దానం చేశారు. దీంతో కిడ్నీలు, కాలేయం, గుండె, కళ్లు ద్వారా ఆరుగురికి జీవం లభించింది. అయితే మరణానంతరం ఇతరుల జీవితాల్లో వెలుగు నింపిన హరీష్ త్యాగాన్ని హైదరాబాద్ సీపీ సజ్జనార్ X వేదికగా ప్రశంసించారు.