విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్
VSP: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ట్రయల్ రన్ విజయవంతమైన మరుసటి రోజే ఉత్తరాంధ్రకు మరో తీపి కబురు అందింది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కార్యకలాపాలను ప్రారంభించేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దశాబ్దాల కాలంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురుచూస్తున్న రైల్వే జోన్ కల సాకారానికి మార్గం సుగమమైంది.