శ్రేయస్ ఆ జట్టులో ఉండాల్సిందే: మాజీ క్రికెటర్

శ్రేయస్ ఆ జట్టులో ఉండాల్సిందే: మాజీ క్రికెటర్

గత ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్‌కు ఆసియాకప్ స్క్వాడ్‌లో చోటుదక్కలేదు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. 'శ్రేయస్ IPLలో తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. రంజీ ట్రోఫీలో ఆడాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాణించాడు. అతడు ఇంకేం చేయాలి. వచ్చే టీ20 ప్రపంచకప్‌లో శ్రేయస్‌కు స్థానం కల్పించాల్సిందే' అని పేర్కొన్నాడు.