నేడు కోదాడలో ఈటల పర్యటన

SRPT: కోదాడ పట్టణంలో బీజేపీ రాష్ట్ర నేత, మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ సోమవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కోదాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని కేంద్ర బడ్జెట్‌పై ప్రసంగించనున్నట్లు బీజేపీ నాయకులు, హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కార్యాలయ సిబ్బంది ఓ ప్రకటనలో తెలిపారు.