తాగునీటి వసతి కల్పించాలని మహిళల ఆందోళన

KMR: బిక్కనూర్ ఇందిరానగర్ కాలనీలో తీవ్ర తాగునీటి ఎద్దడి సమస్యపై స్థానికులు ఆందోళనకు దిగారు. మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట మహిళలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. కాలనీలో నీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.