జిల్లా సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ డీఎస్పీగా అశోక్
BDK: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సైబర్ క్రైమ్స్ కోఆర్డినేషన్ సెంటర్ డీఎస్పీగా బి.అశోక్ నియమిస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం కోఆర్డినేషన్ సెంటర్ డీఎస్పీగా అశోక్ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ రోహిత్ రాజును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి డీఎస్పీ అశోక్ పూల మొక్కను అందజేశారు.