పోలమాంబ హుండీ ఆదాయం ఎంతంటే..?

పోలమాంబ హుండీ ఆదాయం ఎంతంటే..?

VSP: పెదవాల్తేరులోని శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి దేవస్థానం హుండీల లెక్కింపు కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఆలయ ఈవో రాజగోపాల్ రెడ్డి వివరాల ప్రకారం.. హుండీల ద్వారా రూ.9,24,059 నగదు, బంగారం 39.750 గ్రాములు, వెండి 1 కేజీ 15 గ్రాములు కానుకలుగా వచ్చాయని పేర్కొన్నారు. ఈ లెక్కింపు దేవాదాయ శాఖ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, అర్చకులు, పోలీస్ సిబ్బంది సమక్షంలో జరిగింది.