దళితుల మనోభావాలు దెబ్బతీశారు: మాజీ ఎంపీ
E.G: మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అహంకార పూరితంగా దళితులను కించపరిచారని, వారి మనోభావాలను దెబ్బతీశారని రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం దళిత నాయకులతో కలిసి రాజమండ్రిలోని ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై నిజ నిర్ధారణ చేయాలని కోరారు. దళిత సమాజానికి ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.