'కౌలు రైతులకు గుర్తింపు కార్డులిచ్చి పంటను కొనుగోలు చేయాలి'

'కౌలు రైతులకు గుర్తింపు కార్డులిచ్చి పంటను కొనుగోలు చేయాలి'

SKLM: జిల్లాలో గల కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రభుత్వపరంగా పంట కొనుగోలు చేయాలని సోమవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో దరఖాస్తు సమర్పించారు. AP కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు వెలమల రమణ, కార్యదర్శి పి. ప్రసాద్ రావు, జేసీ అహమ్మద్ ఫర్మాన్ ఖాన్‌కు వినతి పత్రం ఇచ్చారు. మొక్కజొన్న,వరి,పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.