TCSతో JNTUH అధికారుల ఒప్పందం

మేడ్చేల్: మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో JNTU, TCS సంస్థతో అధికారులు MOU కుదుర్చుకున్నారు. JNTU కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌తో పాటు మంథనిలో చదివే విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని నైపుణ్యాభివృద్ధి, ఇంటర్న్‌షిప్‌తో పాటు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు యూనివర్సిటీ VC టీ. కిషన్ కుమార్ రెడ్డి, TCS విద్యా వ్యాపార విభాగాధిపతి స్మృతితో కలిసి ఒప్పందం కుదుర్చుకున్నారు.