ఇందిరమ్మ ఇంటిని పరిశీలించిన కలెక్టర్

ఇందిరమ్మ ఇంటిని పరిశీలించిన కలెక్టర్

WNP: పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో పర్యటించి నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ళను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. ఒక గృహ నిర్మాణాన్ని సందర్శించిన కలెక్టర్ లబ్ధిదారుడితో మాట్లాడి నిర్మాణ పురోగతి, చెల్లింపుల పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వంచే అందించాల్సిన చెల్లింపులు సమయానికి అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.