మత్తులో యువకుల హంగామా.. కేసు నమోదు
కృష్ణా: మచిలీపట్నంలో “డ్రగ్స్ వద్దు బ్రో” కార్యక్రమాన్ని పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. వాహనాల తనిఖీల సమయంలో మత్తులో ఉన్న ముగ్గురు యువకులు ట్రాఫిక్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంతో ఇరుగుదురు పేట పోలీసులు కేసు నమోదు చేశారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ పెట్టాలని సీఐ పరమేశ్వరరావు సూచించారు.