అమ్రాబాద్ మండలంలో నేడు ఎమ్మెల్యే పర్యటన

అమ్రాబాద్ మండలంలో నేడు ఎమ్మెల్యే పర్యటన

NGKL: అమ్రాబాద్ మండలంలో గురువారం ఎమ్మెల్యే వంశీకృష్ణ పర్యటించనున్నారు. తిర్మలాపూర్ గ్రామంలో ఉన్న రేణుక ఎల్లమ్మ దేవాలయంలో జరిగే ఉత్సవాలకు ఆయన మధ్యాహ్నం 1 గంటలకు ముఖ్య అతిథిగా హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని వారు పేర్కొన్నారు.