VIDEO: ఎండల తీవ్రతకు ఇబ్బంది పడుతున్న ప్రజలు
MNCL: లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాల్లో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాలూకా పరిధిలోని దండేపల్లి, జన్నారం, మండలాల్లో పగటి ఉష్ణోగ్రత 43 డిగ్రీలుగా నమోదవుతోంది. ప్రతిరోజు ఉదయం 9 గంటలకే 33 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదవుతుంది. దీంతో ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.