తెనాలిలో మాజీ ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు
GNTR: తెనాలి ఐతానగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. పిన్నెల్లి సోదరుల లొంగుబాటు నేపథ్యంలో సంఘీభావంగా పల్నాడు జిల్లాకు వెళుతున్న మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి వద్ద నుంచి శివకుమార్ బయలుదేరగా పోలీసులు అక్కడికి చేరుకుని ఆయనకు నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులపై శివకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.