అది నేను కాదు.. హీరోయిన్ అదితి కామెంట్స్
సోషల్ మీడియాలో తన పేరుతో జరుగుతున్న మోసంపై హీరోయిన్ అదితి రావు హైదరీ స్పందించారు. ఓ వ్యక్తి తన పేరుపై వాట్సాప్, ఫేస్‌బుక్‌లో అకౌంట్‌లను క్రియేట్ చేసినట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఫొటోగ్రాఫర్లు, టెక్నీషియన్లకు మెసేజ్‌లు పంపుతూ.. ఛాన్సులు కావాలంటూ అడుగుతున్నట్లు తెలిపింది. ఆ వార్తలను ఎవరూ నమ్మొద్దని.. లీగల్ చర్యలు తీసుకుంటానని పేర్కొంది.