ద్విచక్ర వాహనం బోల్తా.. ఇద్దరికి గాయాలు

ద్విచక్ర వాహనం బోల్తా.. ఇద్దరికి గాయాలు

KDP: సిద్దవటం మండలంలోని భాకరాపేట గ్రామ సమీపంలోని 11 పోలీస్ బెటాలియన్ వద్ద సోమవారం ద్విచక్ర వాహనం బోల్తా పడి ఇద్దరికి గాయాలయ్యాయి. కమ్మపాలెం ఎస్సీ కాలనీకి చెందిన సుశాంత్, కల్లూరి కళ్యాణీలు ద్విచక్ర వాహనంలో బయలుదేరారు బెటాలియన్ వద్దకు రాగానే సైకిల్‌పై వెళుతున్న బాలుడిని తప్పించబోయి కింద పడ్డారు. గాయపడిన వారిని కడప ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.