వృథాగా పోతున్న తాగునీరు.. పంటపొలాలకు వినియోగం

కోనసీమ: మండల కేంద్రం అయినవిల్లి లంక ప్రధాన రహదారి పక్కన తాగునీరు పైప్ లైన్ లీక్ అవ్వడంతో వృథాగా పోతుంది. దీంతో ఆ తాగునీరు పశువులకు, పంట పొలాలు పిచికారీ చేసేందుకు ఉపయోగిస్తున్నారు. కలుషిత నీరు త్రాగడం వల్ల రోగాల బారిన పడే ప్రమాదం ఉందని గ్రామస్థులు తెలుపుతున్నారు. పంచాయతీ అధికారులు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు.