'పేరుకుపోయిన చెత్తను తొలగించండి'
కృష్ణా: పెడన 9వ వార్డు తహసీల్దార్ కార్యాలయం సమీపంలో రోడ్డుపై చెత్త పేరుకుపోయిందని స్థానికులు శుక్రవారం తెలిపారు. ఈ మార్గంలో దుర్వాసన వ్యాపించి, స్థానిక ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురౌతున్నారని అన్నారు. చెత్త బండి వాహనాలు సమయానికి రావడం లేదని, పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు వారిపై మండిపడ్డారు. అధికారులు స్పందించి, తగు చర్యలు తీసుకోవాలన్నారు.