రామాపురంలో RPL క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే

రామాపురంలో RPL క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే

SRPT: మేళ్లచెరువు మండలం రామాపురంలో RPL క్రికెట్ టోర్నమెంట్‌ను కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడల ప్రాముఖ్యత, యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించడంపై ముఖ్యంగా ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో సర్పంచ్ నాగుల్ మీరా సురేశ్, మేళ్లచెరువు BRS మండలాధ్యక్షుడు, రామాపురం BRS అధ్యక్షుడు కొట్టే నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.