పిచ్చిమొక్కల తొలగింపుపై ప్రత్యేక దృష్టి
BDK: భద్రాద్రి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్‌లో గురువారం కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. వార్డు అధికారి మధుసూదన్ రెడ్డితో కలిసి కాలనీల్లో తిరుగుతూ డ్రైనేజీ పూడికతీత, పిచ్చిమొక్కల తొలగింపు పనుల పురోగతిని చూశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.