తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు

తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదువుతున్నాయి. తెలంగాణలోని ఆసిఫాబాద్ 44.6 డిగ్రీలు, ఆదిలాబాద్ 43.6, నిజామాబాద్, నిర్మల్ 43.3, జగిత్యాల 43.1, సిరిసిల్లలో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీలోని నంద్యాలలో 44.5 డిగ్రీలు, కర్నూలులో 44, కడపలో 43.6, అనంతపురంలో 43.2, సత్యాసాయి జిల్లాలో 42.8, ప్రకాశం జిల్లాలో 42.5 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.