విశాఖలో వన్డే.. టాప్-3లో కోహ్లీ, రోహిత్, ధోనీ

విశాఖలో వన్డే.. టాప్-3లో కోహ్లీ, రోహిత్, ధోనీ

IND vs SA 3వ వన్డేకి విశాఖ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఇది కోహ్లీ, రోహిత్‌కి బాగా కలిసొచ్చిన గ్రౌండ్. ఈ పిచ్‌పై ఇద్దరూ 7 ఇన్నింగ్స్ ఆడగా.. కోహ్లీ 3 సెంచరీలతో 587 రన్స్, రోహిత్ ఓ సెంచరీతో 355 చేశారు. ఇదే మైదానంలో మాజీ కెప్టెన్ ధోనీ కూడా ఓ శతకం బాది మొత్తంగా 260 రన్స్ రాబట్టాడు. ఇప్పటికీ విశాఖలో అత్యధిక రన్స్ చేసిన టాప్ 3 ప్లేయర్లుగా కొనసాగుతున్నారు.