VIDEO: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
ప్రకాశం: బేస్తవారిపేట పట్టణంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నడుచుకుంటూ వెళ్తున్న మేకల వీరయ్యను రసూల్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి స్తానికులు గమనించి చికిత్స నిమిత్తం 108 వాహనం ద్వారా కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.