'బీసీలకు 49% రిజర్వేషన్లు కల్పించండి'
ATP: ప్రధాని నరేంద్ర మోదీ బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఏపీ స్టూడెంట్ జేఏసీ జిల్లా అధ్యక్షులు అమర్ యాదవ్ పేర్కొన్నారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో బీసీలను ఓటు బ్యాంకు మాదిరిగా వాడుకుంటున్నారని విమర్శించారు. బీసీలకు 49% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు.