రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

E.G: చాగల్లు మండలం బ్రాహ్మణగూడెం సమీపంలో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. కలవలపల్లికి చెందిన ఇరగవరపు ఆంజనేయులు(22) తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండంగా ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో తలకు గాయమై ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.