ఆ విగ్రహాన్ని తీసేస్తాం: కేటీఆర్
TG: కాంగ్రెస్ సర్కార్‌పై మాజీమంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం, తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేయడంపై మండిపడ్డారు. దీక్షా దివస్ సాక్షిగా శపథం చేస్తున్నాని.. మళ్లీ వచ్చేది తమ సర్కారేనని, పవర్‌లోకి రాగానే రాజీవ్ విగ్రహం తొలగించి అదే స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.