బేతంచెర్లలో పశువుల కొట్టం దగ్ధం
NDL: బేతంచెర్ల మండలం సీతారామపురంలో శనివారం ప్రమాదవశాత్తు ఎర్రగుడి వెంకటేశ్వర్లుకు చెందిన పశువుల కొట్టం, గడ్డివాము అగ్నికి ఆహుతయ్యాయి. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. ఈ ఘటనలో సుమారు లక్ష రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.