కిరాయి అడిగినందుకు వ్యక్తిపై దాడి

NGKL: కొల్లాపూర్ బీఆర్ఎస్ నాయకుడు గాలి యాదవ్‌ను షాప్‌లో కిరాయికి ఉంటున్న వ్యక్తి దాడి చేసి గాయపరిచారు. స్థానికుల వివరాలు.. గాలి యాదవ్ తన సొంత షాప్‌ను కిరాయికి ఇవ్వగా మంగళవారం కిరాయి డబ్బులు అడగడంతో అవతలి వ్యక్తి తలపై బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడి రక్తస్రావమైంది. స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.