డ్రగ్స్, గంజాయి నిర్మూలనపై DYFI జీపు జాతా

డ్రగ్స్, గంజాయి నిర్మూలనపై DYFI జీపు జాతా

KDP: డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యువతలో అవగాహన కల్పించేందుకు DYFI ఆధ్వర్యంలో మార్చి 17, 18 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా జనచైతన్య జీపు జాతా నిర్వహిస్తున్నట్లు జిల్లా నాయకులు ముడియం చిన్ని, వీరనాల శివకుమార్ తెలిపారు. ఈ జాతా బద్వేలులో ప్రారంభమై వివిధ నియోజకవర్గాల మీదుగా వెళ్లి 18న కడపలో ముగుస్తుందని నేతలు తెలిపారు.