మద్యం దుకాణాల్లోని సామాగ్రి, మద్యం స్వాధీనం

SKLM: నరసన్నపేట సర్కిల్ పరిధిలో 12 పాత మద్యం దుకాణాల్లోని సామాగ్రి, మద్యం ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని ఎక్సైజ్ సీఐ రమణమూర్తి మంగళవారం రాత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాధీనం చేసుకున్న మద్యాన్ని, సామగ్రిని జిల్లా ఎక్సైజ్ డిపోకు పంపిస్తామన్నారు. అనంతరం కొత్త మద్యం పాలసీల ఆధారంగా కొత్త షాపులను ఆయా పరిధిలో కేటాయిస్తారని తెలిపారు.